మే నెల నుంచి ‘అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అర్హత కలిగిన రైతులందరికీ 20 వేల రూపాయల నగదు అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధివిధానాలను ఖరారు చేస్తున్నామని తెలిపారు. రైతులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని..కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రలో భారీ అవినీతి జరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించడానికి ఒక ఇండిపెండెంట్ కమిటీతో విచారణ వేసి 45 రోజుల్లో నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
మే నుంచి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తాం – మంత్రి అచ్చెన్నాయుడు
0
298
Previous article
Next article
Latest Articles
ఏపీలో రెండేళ్లలో 11 శాతం క్రైమ్‌రేట్ తగ్గింది-హోంమంత్రి అనిత
ఏపీలో రెండేళ్లలో 11 శాతం క్రైమ్‌రేట్ తగ్గిందని హోంమంత్రి అనిత తెలిపారు. లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంలో 70 శాతం పూర్తి చేశామని అన్నారు. నిందితుల పట్టివేతలో CC కెమెరాలు కీలకంగా...
- Advertisement -
- Advertisement -


