మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..

హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.. లేదా గుమ్మడికాయ కొట్టినప్పుడు నుంచే ప్రమోషన్స్ చేస్తుంటారు. కానీ.. అనిల్ రావిపూడి అలా కాదు.. కొబ్బరి కాయ కొట్టకుండానే… ప్రమోషన్స్ ను మొదలుపెట్టుస్తుంటారు. త్వరలో పట్టాలెక్కించనున్న వెంకీ, కళ్యాణ్ రామ్ కాంబో మూవీకి సంబంధించి కొత్తగా ప్రచారం మొదలెట్టేసారు.

ఇప్పుడు సినిమా తీయడం ఒక ఎత్తు అయితే.. ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. దీనిని గ్రహించాడు కాబట్టే.. అనిల్ రావిపూడి తనదైన ప్రమోషన్స్ తో జనాల్లో తన సినిమా పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు.. వరుసగా సక్సెస్ సాధిస్తున్నాడు.
చిన్న చిన్న అప్ డేట్ల‌ని సైతం వెరైటీగా ప్ర‌మోట్ చేస్తూ, ప్ర‌జెంట్ చేస్తూ.. ఆకట్టుకొనే ప్ర‌య‌త్నం చేస్తుంటారు అనిల్ రావిపూడి. ఇంకా చెప్పలాంటే.. ఆయ‌న సినిమాల్లో ఎంత కామెడీ ఉంటుందో.. అంత‌కు మించిన వినోదం.. ఆయ‌న ప్ర‌మోష‌న్ల‌లో ఉంటుంది.

మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు సినిమాతో సంక్రాంతికి వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన అనిల్ రావిపూడి… ఇప్పుడు వెంకీ, కళ్యాణ్ రామ్ తో కలిసి మల్టీస్టారర్ తో సందడి చేసేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టు వర్క్ పూర్త‌య్యింది. ఇప్పుడు జీవీ ప్ర‌కాష్ కుమార్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన అప్ డేట్ ని ఆయ‌న వెరైటీగా పంచుకొన్నారు. జంథ్యాల సినిమాలో.. బ్ర‌హ్మానందాన్ని బీచ్‌లో ఇసుక‌తో పూడ్చేసి, ఎటూ క‌ద‌ల‌నివ్వ‌కుండా చేసి అదిలా బాదూ.. అహ్మ‌దాబాదూ.. హైద‌రాబాదూ అంటూ సుత్తి వీర‌భ‌ద్ర‌రావు ఓ క‌థ చెబుతాడు.. సేమ్ టూ సేమ్ అలానే జీవీని ఇసుక‌లో కప్పేట్టేసి మాసు పాట‌, క్లాసు పాట‌, బీజిఎమ్ము పాట‌ అంటూ త‌న‌కెలాంటి పాట‌లు కావాలో లిస్టు చ‌దివాడు అనిల్ రావిపూడి.

దీనికి జీవీ సమాధానం చెప్పడం.. పక్కనే రైటర్ అనంత్ శ్రీరామ్ ని కూడా మరో గొయ్యిలో పూడ్చేయడం చూపించారు. ఇలా జీవి, అనంత్ శ్రీరామ్ లతో సరదాగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోసారి హిట్ మిషన్ మొదలెట్టేసాడురో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. షూటింగ్ స్టార్ట్ చేయకుండానే ఈ రేంజ్లో ప్రమోషన్ చేస్తే.. ఇక షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెంత ప్రమోషన్స్ చేస్తాడో..

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్