ఇమ్రాన్ ఖాన్‌పై షహబాజ్ షరీఫ్ కక్ష సాధింపు 

                  పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అధికారంలో ఉన్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం ఇమ్రాన్‌కు భారీ ఎదురుదెబ్బగా అభివర్ణించవచ్చు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రం నుంచే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న ఉగ్రవాద దాడులు, క్షీణిస్తున్న శాంతిభద్రతల్ని సాకుగా చూపిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రధాని షహజాబ్ షరీప్ కార్యాలయం పేర్కొంది. ప్రధాని సలహా మేరకు అధ్యక్షుడు ఆసిప్ అలీ జర్దారీ ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేశారు.
              ఇదిలా ఉంటే, ఖైబర్ ఫఖ్తుంఖ్వా గవర్నర్ ఫైసల్ కరీం కుండి ఎమర్జెన్సీ నిర్ణయాన్ని స్వాగతించారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి, ప్రజా శ్రేయస్సుకు ఇది సహకరిస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భద్రతా సంస్థలకు ప్రజలు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని కూడా గవర్నర్ అన్నారు. హింస లేదా అల్లర్లలో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
               ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అధికారాలను హరించేందుకే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ విధింపు తర్వాత ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌లో భద్రతను పెంచారు. పలు ప్రధాన రహదారులపై కంటైనర్లను మోహరించారు. ఈ ప్రావిన్సు ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిదీ అక్టోబర్ 4న లక్కీ మార్వత్ నుంచి ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం యాత్ర మొదలుపెట్టారు. ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైలులో ఉన్నారు. ఆయన విడుదల కోసం పీటీఐ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు రోడ్లపైకి వస్తున్నారు.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్