ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు సర్కార్ – వైఎస్ జగన్

 

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఘోరంగా ఖూనీ చేస్తోందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఉదయం 4 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలను ఆక్రమించి ఓటర్లను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పులివెందులలోని 80 బూత్‌లకు గానూ 70 చోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లోపలికి రానివ్వకుండా వెళ్లగొట్టారని, పోలీసుల సహకారంతో యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ అభ్యర్థి ప్రమీలమ్మపై దాడికి తెగబడ్డారని, ఓటర్ల స్లిప్పులను బలవంతంగా లాక్కుని ‘మీ ఓటు పడిపోయింది’ అని వెనక్కి పంపించేస్తున్నారని ఆరోపించారు.

Latest Articles

పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఘర్షణలు

  కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పలు వార్డుల్లో ఘర్షణలు చెలరేగడంతో ప్రాంతం రణరంగంగా మారింది. 8, 9, 10...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్