రక్తం అమ్ముకుని సంపాదించాల్సిన అవసరం ఉందా..? బ్లడ్ బ్యాంక్ వివాదంపై చిరంజీవి

ఎన్ని విమర్శలు వచ్చినా.. బ్లడ్ బ్యాంక్ విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి తన వాదనను మరోసారి స్పష్టంగా వినిపించారు. గతంలో తన బ్లడ్ బ్యాంక్ చుట్టూ రేగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ.. రక్తాన్ని అమ్ముకుని డబ్బులు సంపాదిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.

మెగా యూత్ ఫోర్స్ ఫ్యాన్స్ మీట్లో మాట్లాడిన చిరంజీవి.. సినిమాల్లో తాను తీసుకునే రెమ్యూనరేషన్తో సమానమైన డబ్బు సంపాదించాలంటే ఎన్ని రక్తం ప్యాకెట్లు అమ్మాల్సి వస్తుందో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.తాను ఎలాంటి డొనేషన్లు తీసుకోకుండా తన కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంక్ను నిర్వహిస్తున్నానని చిరంజీవి చెప్పారు. అదే సమయంలో అభిమానులు కూడా రక్తదానం చేస్తూ ఈ సేవా కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్నారని పేర్కొన్నారు.

అయితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్పై వివాదం ఇప్పటిది కాదు. 2011 సమయంలో నటుడు రాజశేఖర్, జీవిత.. బ్లడ్ బ్యాంక్ నిర్వహణపై పలు ఆరోపణలు చేశారు. అభిమానులు, ప్రజలు ఉచితంగా ఇచ్చిన రక్తాన్ని డబ్బులకు విక్రయిస్తున్నారంటూ వారు అప్పట్లో ఆరోపించారు. ఆర్థిక వ్యవహారాలపైనా ప్రశ్నలు లేవనెత్తారు.ఈ వ్యాఖ్యలు అప్పట్లో టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీశాయి. వివాదం నేపథ్యంలో అధికారులు బ్లడ్ బ్యాంక్ నిర్వహణ, రికార్డులు, ఇతర అంశాలను పరిశీలించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. బ్లడ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తోందని, అనుమతించిన ప్రాసెసింగ్ ఛార్జీలకు సంబంధించిన అంశాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.ఆ తర్వాత ఈ వివాదం న్యాయస్థానం వరకు వెళ్లింది. బ్లడ్ బ్యాంక్పై చేసిన వ్యాఖ్యలు సంస్థ ప్రతిష్టకు నష్టం కలిగించాయంటూ నిర్మాత అల్లు అరవింద్.. రాజశేఖర్, జీవితపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.ఈ కేసులో 2023లో నాంపల్లి కోర్టు రాజశేఖర్, జీవితకు ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు వీలుగా వారికి బెయిల్ లభించింది.

ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన గతంలో పలు సందర్భాల్లో వివరించారు. రక్తం అందుబాటులో లేక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారనే వార్త తనను ఆలోచింపజేసిందని చెప్పారు.ఇంతమంది ప్రజలు ఉన్నప్పటికీ.. అత్యవసర సమయంలో అవసరమైన వ్యక్తికి రక్తం ఎందుకు అందుబాటులో ఉండకూడదనే ఆలోచనతోనే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు చిరంజీవి గతంలో వెల్లడించారు.అలా 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభమైంది. ఆ తర్వాత అభిమానులతో పాటు పలువురు స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు.సినిమా విజయంతో వచ్చే ఆనందం ఒకవైపు ఉంటే.. ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేయడం ద్వారా వచ్చే సంతృప్తి మరింత గొప్పదని చిరంజీవి గతంలో చెప్పుకొచ్చారు.

మొత్తానికి ఎన్నో ఏళ్ల క్రితం మొదలైన బ్లడ్ బ్యాంక్ వివాదం.. చిరంజీవి తాజా వ్యాఖ్యలతో మరోసారి చర్చలోకి వచ్చింది. తన సేవా కార్యక్రమంపై వచ్చిన ఆరోపణలను మరోసారి ఖండించిన చిరంజీవి.. బ్లడ్ బ్యాంక్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా అభిమానులకు వివరించారు.

Latest Articles

భార్య, ఇద్దరు పూజారులపై కాల్పులు.. పిల్లలతో గదిలో బంధించుకుని..

ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూజా కార్యక్రమం సందర్భంగా ఆధార్‌ కార్డు విషయంలో తలెత్తిన వివాదం తీవ్రరూపం దాల్చడంతో అరవింద్‌సింగ్ అనే వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్