దూసుకొస్తున్న మురసు తుఫాన్

 

నైరుతి బెంగాల్ ఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుపాను తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు-ఈశాన్యంగా 260 కిలోమీటర్లు, నెల్లూరుకు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది.

ఈ ప్రభావంతో ఉత్తర తమిళనాడు, ముఖ్యంగా చెన్నై నగరంతో పాటు చెంగల్‌పట్టు, తిరువళ్లూర్ జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో మాధవరం 11 సెం.మీ, ఎన్నోర్ పోర్ట్ 10 సెం.మీ, నుంగంబాక్కం 10 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదు చేశాయి. తీవ్ర ప్రతికూల వాతావరణం దృష్ట్యా చెన్నై విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఐఎమ్‌డీ చెన్నైకి ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

మరోవైపు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ జి.ఎస్. సమీరన్ క్షేత్రస్థాయిలో నీటి నిల్వలను తొలగించే పనులను పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని 22 సబ్‌వేలలో కేవలం రెండు సబ్‌వేల్లో మాత్రమే స్వల్పంగా నీరు చేరిందని, దాన్ని తక్షణమే పంపుల ద్వారా తొలగించి రాకపోకలను పునరుద్ధరించామని తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని 28 పర్యవేక్షణ కేంద్రాల్లో భారీ వర్షాలు, ప్యారీస్ మరియు మణలి వంటి 5 ఉత్తర ప్రాంతాలలో తీవ్ర వర్షపాతం నమోదైంది.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం, నవంబర్ 2 అర్థరాత్రి నుంచి నవంబర్ 3 తెల్లవారుజాము మధ్య ఈ తీవ్ర తుపాను నెల్లూరు – నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 100 నుండి 110 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.

Latest Articles

‘మురసు తుఫాన్‌ ‘ పై సీఎం చంద్రబాబు సమీక్ష

కోస్తాంధ్ర తీరానికి అతి సమీపంలో ఉన్న మురసు తుఫాన్ ప్రభావం, ముందస్తు సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. RTGS నుంచి అధికారులు, జిల్లాల కలెక్టర్లతో క్షేత్రస్థాయిలో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించారు. తుఫాన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్