ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నవంబర్ 1న ‘ఇండియా’ కూటమి భారీ ర్యాలీని.. వాయిదా వేయాలని వ్యాపారులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కోరాయి. దీపావళి పండగ సీజన్లో ఈ ర్యాలీతో పదివేల కోట్ల మేర వ్యాపార నష్టం జరుగుతుందని.. ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ లేఖ రాశారు.
పండగ సీజన్‌ను దృష్ట్యాలో ఉంచుకుని నవంబర్ 10 తర్వాత ర్యాలీని నిర్వహించాలని ఆయన ఆ లేఖలో సూచించారు. నవంబర్ 6న ధంతేరస్, నవంబర్ 8న దీపావళి ఉన్నందున.. కొనుగోళ్ల కోసం ప్రజలు భారీగా మార్కెట్లకు వస్తారని.. ఈ సమయంలో ర్యాలీ నిర్వహిస్తే వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. దీపావళి పండగ వేళ ఢిల్లీ వ్యాప్తంగా బంగారం, వెండి, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, గృహోపకరణాలు, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, వాహనాలు, స్థిరాస్తి, గిఫ్ట్ ఆర్టికల్స్ వంటి అన్ని రంగాల్లో 25 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని సీటీఐ అంచనా వేసింది.
ర్యాలీని వాయిదా వేయాలని రాహుల్ కి వ్యాపారుల విజ్ఞప్తి
Latest Articles
- Advertisement -


