తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోలీసుల కనుసన్నల్లోనే ఈ దాడులు జరగడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తిరుపతిలో వైసీపీ మేయర్ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను టీడీపీ శ్రేణులు చించేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. వైసీపీ మేయర్‌ అభ్యర్థి వాసు యాదవ్‌ తరఫున ప్రపోజర్‌గా ఎంపీ గురుమూర్తి స్వయంగా నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. అయితే, నామినేషన్ కేంద్రం వద్దే ఎంపీని పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. తాను ప్రపోజర్‌గా వచ్చానని గురుమూర్తి తెలపడంతో, పత్రాలు చూపించాలని పోలీసులు కోరారు. ఎంపీ పత్రాలు చూపించగానే, అక్కడే కాపుకాసిన టీడీపీ గూండాలు వాటిని బలవంతంగా లాక్కుని ముక్కలు చేసి చించేశారు. ఈ ఘటనలో పోలీసుల వైఖరి పూర్తిగా ఏకపక్షంగా ఉండి, టీడీపీ మూకలకు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద వందలాది మందిని గుంపులుగా చేర్చి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.. అధికారులు, పోలీసుల కళ్లముందే నామినేషన్‌ పత్రాలను చించివేస్తున్నా, ప్రత్యర్థులపై దాడులు జరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని వైసీపీ ఆరోపిస్తోంది. నేడు, రేపు నామినేషన్లు పడకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ భారీ కుట్రలకు తెరతీసిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

అధికార బలాన్ని, పోలీసు బలగాలను అడ్టుపెట్టుకుని ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునేందుకు పన్నాగం పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలలో ఈ తరహా హింస, దౌర్జన్యాలు సరికాదని, ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని పారదర్శకతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest Articles

పులివెందులలో పోలీస్ కాల్పులు ?

  కడప జిల్లా పులివెందులలో హైటెన్షన్‌ నెలకొంది. నామినేషన్ల సందర్భంగా పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఎంపీ అవినాష్ రెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్