ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌లో దారుణం

ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అక్రమ సంబంధాన్ని ప్రశ్నించాడనే కక్షతో భర్తనే అత్యంత కిరాతకంగా హతమార్చిన భార్యతో పాటు మరో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది.
—————-
స్పెషల్ కోర్ట్ జడ్జి.. డాక్టర్ విజయ్ కుమార్ టాలియన్ ఈ కేసును విచారించి, ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతో పాటు చెరో రూ. 1.10 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితురాలైన మహిళకు తన బావమరిదితో వివాహేతర సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధాన్ని ఆమె భర్త తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని.. వారు పథకం పన్నారు. అనుకున్నదే తడవుగా, ఆ భార్య తన బావమరిదితో కలిసి ఇంట్లోనే చున్నీతో భర్త గొంతు బిగించి అత్యంత క్రూరంగా హత్య చేశారు.
—————-
ఈ దారుణం తర్వాత నేరాన్ని కప్పిపుచ్చేందుకు, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని సమీపంలోని ఓ నిర్మాణంలో ఉన్న గుంటలో పడేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. పోస్ట్‌మార్టం నివేదికలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడి మెడ ఎముక విరిగిపోయిందని, ఊపిరి ఆడకనే మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదిక స్పష్టం చేసింది.
—————-
ఈ కేసులో పక్కా ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి డాక్టర్ విజయ్ కుమార్ టాలియన్ … నేరం రుజువు కావడంతో దోషులకు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పు సమాజంలో అరాచకాలకు పాల్పడేవారికి ఒక హెచ్చరికగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్