ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?

ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు.

సందీప్ కిషన్ హీరోగా జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిగ్మా’ సినిమాతో ఫరియా అబ్దుల్లా తమిళ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న ఆమె.. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.‘సిగ్మా’ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్న ఫరియా.. ఈ సినిమా తర్వాత తమిళం నుంచి మరిన్ని అవకాశాలు వస్తున్నాయని తెలిపారు.

ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నానని.. అయితే ‘సిగ్మా’ విడుదలైన తర్వాతే తదుపరి ప్రాజెక్టుల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల మధ్య తన అనుభవాన్ని కూడా ఫరియా పంచుకున్నారు. రెండు ఇండస్ట్రీలు దాదాపు ఒకేలా ఉంటాయని.. అయితే ఆహారపు అలవాట్లలో మాత్రం కొంత తేడా కనిపిస్తుందని సరదాగా చెప్పారు. తన తొలి తమిళ సినిమానే మంచి ప్రాజెక్ట్ కావడం సంతోషంగా ఉందని తెలిపారు.

అయితే ఈ ఇంటర్వ్యూలో ఫరియా చెప్పిన మరో విషయం ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. నటిగా కెరీర్ కొనసాగిస్తూనే.. తనకు దర్శకత్వం వహించాలనే ఆసక్తి కూడా ఉందని ఆమె వెల్లడించారు.ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధం చేస్తున్నానని చెప్పిన ఫరియా.. వెంటనే దర్శకత్వంలోకి అడుగుపెట్టే ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేశారు. మెగాఫోన్ పట్టడానికి ఇంకా కొంత సమయం పడుతుందని తెలిపారు. అంటే ప్రస్తుతం నటనపైనే ఫోకస్ చేస్తూనే.. భవిష్యత్తు కోసం కథలపై వర్క్ చేస్తున్నారన్నమాట.ఇక ఒకవేళ తాను దర్శకురాలిగా మారితే.. కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా ఆ సినిమాలో నటిగా కూడా కనిపిస్తానని ఫరియా చెప్పడం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. అంటే తన దర్శకత్వంలో తానే ఒక ముఖ్యమైన పాత్రను పోషించే ఆలోచనలో ఉన్నారన్నమాట.

భారతీయ సినీ పరిశ్రమలో నటీమణులుగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత దర్శకత్వం వైపు వెళ్లిన పలువురు మహిళలు ఉన్నారు. అలాంటి వారి ప్రయాణం తనకు స్ఫూర్తినిస్తోందని ఫరియా పేర్కొన్నారు. టాలీవుడ్లో విజయ నిర్మల, బి.జయ, నందిని రెడ్డి వంటి మహిళా దర్శకురాళ్లు తమదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం హీరోయిన్గా ఉన్నప్పుడే దర్శకత్వం గురించి ఆలోచించడం ఫరియాలోని మరో కోణాన్ని బయటపెడుతోంది.

నటనతో పాటు కథలు రాయడం, దర్శకత్వం వహించడం వంటి క్రియేటివ్ అంశాలపై కూడా ఆమెకు ఆసక్తి ఉందని ఈ వ్యాఖ్యలు చెబుతున్నాయి.మరి ‘సిగ్మా’తో తమిళ ప్రేక్షకులకు ఫరియా ఎంతవరకు కనెక్ట్ అవుతారు? ఆ తర్వాత ఆమె ఎలాంటి కథలను ఎంచుకుంటారు? దర్శకురాలిగా మారాలన్న కలను ఎప్పుడు నిజం చేసుకుంటారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి మాత్రం హీరోయిన్గా కొనసాగుతూనే.. భవిష్యత్తులో మెగాఫోన్ పట్టేందుకు ఫరియా అబ్దుల్లా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

Latest Articles

చిరు నోట ‘తొక్కేయాలని చూస్తున్నావా?’

సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే మీమ్స్, ట్రోలింగ్స్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ సరదా కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్