పులివెందులలో రాజకీయ లబ్ది కోసమే వైసీపీ గొడవలు చేస్తోంది – బీటెక్ రవి

పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ పులివెందుల ఇన్‌చార్జ్ బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శించారు. గతంలో సొంత బాబాయిని హత్య చేసి ఆ నేరాన్ని టీడీపీపైకి నెట్టే ప్రయత్నం చేశారని, ఇప్పుడు మళ్ళీ వాహనాలను తగలబెట్టి టీడీపీపై నిందలు వేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ముందురోజే వాహనాల దహనం జరగడం, తెల్లవారుజామునే దాడులు జరిగాయంటూ ప్రచారం చేయడం వెనుక జగన్ రాజకీయ వ్యూహం ఉందని బీటెక్ రవి వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్నీ జగన్ డైరెక్షన్‌లోనే చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రజల్లో తీవ్ర గందరగోళం సృష్టించి, తెలుగుదేశం పార్టీకి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే వైసీపీ ఇలాంటి ఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని విమర్శించారు. వాస్తవాలను పక్కదారి పట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

Latest Articles

గుంతకల్‌ ని గెలుచుకుని చంద్రబాబు కు కానుకగా ఇస్తా – ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ప్రజలు టీడీపీని ఆదరిస్తున్నారని అనంతపురం జిల్లా గుంతకల్‌లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే గుత్తి మున్సిపాలిటీని టీడీపీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్