కేంద్రం హామీలు నెరవేర్చడం లేదు ఎన్‌సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఉద్దేశాలపై నేషనల్ కాన్ఫరెన్స్ NC అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. బారాముల్లాలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం చెప్పే మాటలకు, చేసే పనులకు అస్సలు పొంతన ఉండదని విమర్శించారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం వల్లే ఈ ప్రాంతంపై దృష్టి నిలిచి ఉందనేలా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
అయితే తమ దేశభక్తిని ప్రశ్నించలేరని స్పష్టం చేసిన అబ్దుల్లా.. “మేము ఎప్పుడూ భారతీయులమే కాదు అని చెప్పలేదు. మేము గాంధీ, నెహ్రూల కాలంలో భారత్‌లో చేరాం. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, న్యాయంపై పునాది వేసిన భారత్‌లో భాగమయ్యాం” అని పునరుద్ఘాటించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలని, మౌనంగా ఉంటే ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని పిలుపునిచ్చారు.
సరిహద్దు పునర్విభజన , శాసనసభ ఎన్నికల అనంతరం జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని ఫరూక్ అబ్దుల్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో పీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే 2019లో కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దయ్యే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. మతపరమైన, ప్రాంతీయ విబేధాలను పక్కనబెట్టి ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని, పాలకుల అణచివేత శాశ్వతం కాదని, ప్రజల ఆకాంక్షలే గెలుస్తాయని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.

Latest Articles

బాండ్లపై సంతకాలు చేసే ప్రసక్తే లేదన్న నేహా బోరా

శాంతియుత నిరసనలు తెలిపే ప్రజాస్వామ్య హక్కును అణచివేయడానికే అధికారులు ‘పీస్ బాండ్ల’ను ఆయుధంగా వాడుకుంటున్నారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా విమర్శించారు. రాజ్యాంగం పౌరులకు అందించిన నిరసన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్