చిరు నోట ‘తొక్కేయాలని చూస్తున్నావా?’

సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే మీమ్స్, ట్రోలింగ్స్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ సరదా కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో ఆయన చేసిన సరదా సంభాషణ అందరి దృష్టిని ఆకర్షించింది.స్టేజ్పై ఫరియాతో మాట్లాడుతూ.. తనకు ఆమెతో డాన్స్ చేసే అవకాశం ఎందుకు రాలేదని చిరంజీవి నవ్వుతూ అడిగారు. గతంలో ‘విశ్వంభర’ సినిమాలో ఫరియాతో కలిసి డాన్స్ చేసే ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదని సరదాగా ప్రశ్నించారు.ఇద్దరి మధ్య హైట్ డిఫరెన్స్ ఉంటే.. తాను హీల్స్ వేసుకుని అయినా డాన్స్ చేసేవాడినంటూ చిరంజీవి సరదాగా చెప్పడంతో ఈ సంభాషణ మరింత ఫన్నీగా మారింది.

అదే ఫ్లోలో ‘నన్ను ఎందుకు అవాయిడ్ చేశావు.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావేమో అనుకున్నాను’ అంటూ చిరంజీవి పంచ్ వేశారు.ఈ ఒక్క డైలాగ్తో అక్కడున్న ప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోయారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ కామెంట్కు మరో అర్థం దొరికింది. కొన్నేళ్లుగా ఇంటర్నెట్లో చిరంజీవిని ఉద్దేశించి ‘బాస్ తొక్కేశాడు’ అంటూ సరదాగా మీమ్స్, ట్రోలింగ్ కంటెంట్ కనిపిస్తుంటుంది.

ఒక సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. మరో నటుడికి అవకాశాలు తగ్గినా.. దానికి చిరంజీవే కారణమన్నట్టుగా సరదాగా మీమ్స్ చేయడం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్గా మారింది. అయితే ఇవి వాస్తవ ఆరోపణలుగా కాకుండా.. ఎక్కువగా నెటిజన్లు సరదా కోసం ఉపయోగించే ట్రోలింగ్ కంటెంట్గానే కనిపిస్తుంటాయి.ఇప్పుడు అదే పదాన్ని చిరంజీవి స్వయంగా స్టేజ్‌పై ఉపయోగించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. నెట్టింట తనపై వచ్చే మీమ్స్, ట్రెండింగ్ పదాలను మెగాస్టార్ కూడా గమనిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే చిరంజీవి ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా లైట్గా తీసుకున్నట్టే కనిపించారు. తనపై సోషల్ మీడియాలో వచ్చే సరదా ట్రోల్స్‌ను సీరియస్‌గా తీసుకోకుండా.. అదే పదాన్ని తన కామెడీలో భాగం చేసుకోవడం ఈ ఈవెంట్లో హైలైట్గా నిలిచింది.ముఖ్యంగా ఫరియాతో జరిగిన సంభాషణ మొత్తం సరదా వాతావరణంలోనే సాగింది. తనను అవాయిడ్ చేశారంటూ నవ్వుతూ చేసిన కామెంట్.. చివరకు సోషల్ మీడియాలోనే మరోసారి చర్చకు దారితీసింది.

ఇంటర్నెట్లో తనపై నడిచే మీమ్స్, ట్రోలింగ్‌ను చిరంజీవి ఎంతవరకు గమనిస్తారన్నది మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఈ ఈవెంట్లో మాత్రం సోషల్ మీడియాలో తరచుగా వినిపించే ఓ సరదా పదాన్ని ఆయన స్వయంగా ఉపయోగించడం మాత్రం నెటిజన్లకు బాగా కనెక్ట్ అయింది.ట్రోల్స్‌కు సీరియస్‌గా స్పందించకుండా.. అదే ట్రోలింగ్ భాషను కామెడీగా మార్చి స్టేజ్‌పై పంచ్ వేయడం ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ‘బాస్‌కు ఇంటర్నెట్ ట్రెండ్స్ తెలుసు’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Latest Articles

ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?

ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్