హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని ఆయన విమర్శించారు. జంతర్ మంతర్ వద్ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనను భగ్నం చేయడంపై ఆయన మండిపడ్డారు.

హిట్లర్ కాలంలో ఆ దేశ సైనికులు ప్రతిపక్షాలపై ఏ విధంగా దాడులకు పాల్పడ్డారో.. నేడు ప్రధాని మోదీ కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. అరెస్టు చేసిన విద్యార్థులందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఎన్నికల సంఘం పనితీరుపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసీ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని, అసలు ఆ సంస్థే దొంగలా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తన కార్యాలయాన్ని నేరుగా ఈసీ కార్యాలయంలోనే తెరుచుకోవచ్చని ఎద్దేవా చేశారు.

యూపీలో ఫారమ్-7 ద్వారా ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. నైతిక విలువలను పూర్తిగా కోల్పోయిన ఎన్నికల కమిషనర్ తనంతట తానుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఢిల్లీలో జరిగిన ఈ నిరసనల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు 1,000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కేరళ మాజీ సీఎం పినరయి విజయన్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వంటి ప్రముఖ నేతలు కూడా ఉన్నారు.

భద్రతా కారణాల రీత్యా పలు మెట్రో స్టేషన్లను మూసివేయడం, భారీ బారికేడ్లను ఏర్పాటు చేయడంపై ప్రజాస్వామ్య హక్కుల హరణం జరుగుతోందంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని అఖిలేష్ యాదవ్ హెచ్చరించారు.

Latest Articles

మణిపూర్‌లోని మళ్లీ చెలరేగిన జాతి హింస

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మళ్లీ హింసాగ్ని ఎగిసిపడింది. కామ్‌జోంగ్, కాంగ్‌పోక్పి, ఉఖ్రుల్ జిల్లాల్లో గత 24 గంటల్లో చోటుచేసుకున్న ఘర్షణలు, కాల్పుల ఘటనల్లో ఒక కుకీ తెగకు చెందిన ఐదుగురు పిల్లల తల్లి,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్