బాలాపూర్ గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయయ్యాయి. గణపతిని వాహనంపైకి ఎక్కించారు. కాసేపట్లో గ్రామ ప్రదిక్షణ ప్రారంభం కానుంది. బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఈసారి కొత్తగా 9 మంది సభ్యులు పోటీలో నిలిచారు. ఇప్పటికే వీరంతా బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితిలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో ఈసారి లడ్డూ వేలంపాటపై ఆసక్తి నెలకొంది. గతేడాది బాలాపూర్ లడ్డూ 35 లక్షల రూపాయల ధర పలికింది. ఈసారి వేలంలో లడ్డూ ఎంత ధర పలుకుతుందన్నది ఉత్కంఠగా మారింది.
బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం సంప్రదాయం 1994లో 450 రూపాయలతో ప్రారంభమైంది. అప్పట్నుంచి ప్రతి ఏడాది వేలం ధర పెరుగుతూ వచ్చింది. 2020లో కరోనా కారణంగా సాధారణ వేలం నిర్వహించలేదు. 2025లో కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్ 35 లక్షల రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. ఇది అప్పటి వరకు అత్యధిక వేలం ధరగా నమోదైంది. 2024లో కొలను శంకర్‌రెడ్డి 30 లక్షల రూపాయలను లడ్డూను దక్కించుకున్నారు. ఇప్పుడు 2026 వేలంలో కొత్తగా 9 సభ్యులు రంగంలోకి రావడంతో, ఈసారి లడ్డూ వేలంపాటపై ఆసక్తి నెలకొంది.


