ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట…స్క్వాష్ విభాగంలో రెండు పతకాలు ఖాయం

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. స్క్వాష్ విభాగంలో భారత స్టార్లు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లారు. దీంతో భారత్‌కు స్క్వాష్‌ విభాగంలో రెండు పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌ ఆటగాడు మహమ్మద్‌ ఇర్ఫాన్‌పై.. భారత ప్లేయర్‌ అభయ్ సింగ్ సంచలన విజయం సాధించారు. ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అభయ్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. దీంతో పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు స్వర్ణం లేదా రజత పతకం ఖాయమైంది.

మరోవైపు మహిళల సింగిల్స్‌లో 18 ఏళ్ల యంగ్ సెన్సేషన్ అనాహత్ సింగ్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. సెమీఫైనల్లో ప్రపంచ 6వ ర్యాంకర్ జపాన్ ప్లేయర్ సతోమి వతనాబేపై 3-2 తేడాతో అద్భుత విజయం సాధించారు. తొలి రెండు గేమ్‌లు ఓడిపోయి 0-2తో వెనుకబడినప్పటికీ.. ఏమాత్రం సడలని పోరాట పటిమతో వరుసగా మూడో గేమ్‌ను కైవసం చేసుకుని మ్యాచ్‌ను తిప్పికొట్టారు. 11-9, 13-11, 10-12, 6-11, 3-11 తేడాతో విజయం సాధించి తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నారు. అనాహత్ సింగ్ ఫైనల్‌ చేరడంతో మహిళల సింగిల్స్‌లోనూ.. భారత్‌కు స్వర్ణం లేదా రజతం ఖాయమైంది. బంగారు పతకాలే లక్ష్యంగా ఇద్దరు భారత స్టార్లు ఫైనల్ పోరులో తలపడనున్నారు.

Latest Articles

ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?

ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్