నాగాలాండ్‌లో కల్తీ మద్యం తీవ్ర విషాదం నింపింది. కల్తీ మద్యం తాగి రెండు జిల్లాల్లో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మొకోక్చుంగ్ జిల్లాలో 8 మంది, అలాగే టుయెన్సాంగ్ జిల్లాలో 11 మంది ఈ కల్తీ మద్యానికి బలియైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సిట్‌ను ఏర్పాటు చేసి.. విచారణను వేగవంతం చేశారు. కల్తీ మద్యం సరఫరా మూలాలను ఛేదించేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంలో ఇప్పటివరకు 19 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. వారి వద్ద నుంచి దాదాపు 3 వేల మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. మరణాలకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం గౌహతి పంపినట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి 1990 నుంచి నాగాలాండ్‌లో పూర్తిస్థాయి మద్యం నిషేధ చట్టం అమల్లో ఉన్నప్పటికీ.. ఈ స్థాయిలో కల్తీ మద్యం రాకెట్ వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీసింది.
నాగాలాండ్‌లో కల్తీ మద్యం తాగి 19 మంది మృతి
0
11
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


