ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారిణి మీరాబాయి చాను రజతం సాధించారు. మహిళల 49 కేజీల విభాగంలో ఆమె ఈ పతకం గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత అయిన ఈమె.. స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు ఎత్తారు. మొత్తంగా 198 కేజీల బరువును సాధించి.. 1998లో కర్ణం మల్లేశ్వరి కాంస్యం గెలుచుకున్న తర్వాత.. దేశానికి ఆసియా క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆమె తొలి పతకాన్ని అందించారు. చాను సాధించిన ఒలింపిక్ రజతం, ఒక స్వర్ణంతో సహా మూడు ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాలు.. పలు కామన్వెల్త్ గేమ్స్, ఛాంపియన్షిప్ టైటిళ్లు, ఆసియా ఛాంపియన్షిప్ కాంస్యం వంటి వాటికి ఈ ఆసియా క్రీడల రజతం తోడయింది.
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం… వెయిట్‌లిఫ్టింగ్ మీరాబాయి చానుకు రజతం
0
116
Previous article
Latest Articles
నీటి ట్యాంకర్ల యజమానుల సమ్మె విరమింపజేసిన ‘ హైడ్రా’
వాటర్ ట్యాంకర్ల సమ్మె విరమణ హర్షణీయం
సమస్య పరిష్కరించినందుకు హైడ్రాకు అభినందనలు
హైడ్రా కమిషనర్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన హాస్టళ్ల నిర్వాహకులు హైదరాబాద్‌లో నీటి ట్యాంకర్ల యజమానులు...
- Advertisement -
- Advertisement -


