అలనాటి హీరోయిన్స్ అక్కాచెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం ముదురుతోంది. తనను అక్క అంబిక మోసం చేసిందంటూ చెల్లి రాధ పోలీసులను ఆశ్రయించారు. తనకు తెలియకుండా రూ.46 కోట్ల చెక్కును అంబిక మార్చుకునేందుకు ప్రయత్నించారంటూ రాధ ఆరోపించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు.
అయితే రాధ ఆరోపణలకు అంబిక కౌంటర్ ఇచ్చారు. తన ఆస్తిని తనకు తెలియకుండా రాధే తన పేరు మీద మార్చుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రూ.46 కోట్లకు సంబంధించిన చెక్కును రాధే తనకు ఇచ్చారని.. ఆ చెక్కు విత్‌డ్రా కాకుండా అడ్డుకున్నది కూడా రాధేనని అంబిక తెలిపారు. తాను మోసం చేసి చెక్కు తీసుకున్నానని రాధ చెప్పడం విడ్డూరంగా ఉందంటూ అంబిక మండిపడ్డారు.


