పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఫకృద్ధీన్ పాలెం గ్రామంలో రూ. 73 లక్షల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మైసమ్మ చెరువు, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్కును ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను కేవలం నీటి వనరులుగానే కాకుండా ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం అందించే సామాజిక వేదికలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మైసమ్మ చెరువును నమూనాగా అభివృద్ధి చేశారు.

పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మైసమ్మ చెరువును సందర్శించిన పవన్‌ కళ్యాణ్‌ వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్‌తోపాటు పిల్లల పార్కును ప్రారంభించారు. అలాగే నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి చేసిన మరో 11 చెరువులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పరిధిలో అభివృద్ధి చేసిన 14 చెరువులకి సంబంధించిన గ్యాలరీని సందర్శించారు.

అనంతరం చెరువు గట్టు వెంబడి వాకింగ్ చేస్తూ, అక్కడ ఉన్న భారీ వృక్షాల వయసు, కొన్ని వృక్షాల శాస్త్రీయ నామం తదితర అంశాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల సుందరీకరణ గ్రామీణ ప్రజలకు విశ్రాంతి, వినోదంతోపాటు ఆరోగ్యాన్ని అందించడంలో ఈ చెరువులు దోహదపడతాయని తెలిపారు.

మోడల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దిన ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువు పరిసరాలను పచ్చటి మొక్కలతో అభివృద్ధి చేసి, గట్టును బలోపేతం చేశారు. గ్రామ ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో నడక ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ఏర్పాటు చేసిన వాకింగ్‌ ట్రాక్‌ ను ప్రారంభించారు. మహిళలు, యువతతో పాటు వృద్ధులు కూడా వ్యాయామం చేసుకునేలా ఓపెన్ ఎయిర్ జిమ్‌ను, జాతీయ భావన పెంపొందించేలా జెండా స్థూపాన్ని ఏర్పాటు చేశారు.

చెరువు కుడి వైపున పిల్లల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన చిల్డ్రన్స్ పార్కును చిన్నారులతో కలసి ప్రారంభించారు. పార్కులో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువు భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలకు మోడల్ నమూనాగా నిలవాలని ఆకాంక్షించారు.

ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 కోట్ల వ్యయంతో 105 చెరువుల సుందరీకరణ పనులు చేపట్టారు. వీటిలో దాదాపు సగానికి పైగా పనులు పూర్తికాగా, మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి అన్ని చెరువుల సుందరీకరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మైసమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన పవన్‌

అంతకుముందు గట్టుపై ఉన్న ఆలయంలో మైసమ్మ అమ్మవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువు మధ్య భాగానికి వచ్చే విధంగా నూతనంగా నిర్మిస్తున్న నందీశ్వరుడి సహిత శివుని విగ్రహాన్ని పరిశీలించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఫకృద్ధీన్ పాలెంలోని వినాయకుడి గుడిని సందర్శించారు.

గ్రామస్తులతో మమేకం అవుతూ… గ్రామంలో సౌకర్యాల పరిశీలన

చెరువు ప్రారంభోత్సవానికి విచ్చేసి ప్రజల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆయన ఆప్యాయంగా పలుకరించారు. ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. ఫకృద్ధీన్ పాలెం గ్రామ సచివాలయ భవనాన్ని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త కోసం విడివిడిగా ఏర్పాటు చేసిన కుండీలు పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పారిశుధ్య కార్మికులను పలుకరించి ఫొటోలు దిగారు.

Latest Articles

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు- చంద్రబాబు

చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వాతావరణ సమతుల్యం దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్