కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు విచారించారు. విచారణలో మొదట నోరు విప్పని సాదిక్ ఆధారాలను ముందు ఉంచడంతో నిజాలను అంగీకరించాడు. నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డికి సైనైడ్ ఇచ్చి హత్య చేసినట్టుగా అంగీకరించాడు. నూకరాజు కూతురు సౌజన్యను పెళ్లి చేసుకుంటే రూ.25 కోట్ల ఆస్తి వస్తుందని భావించాడు. అయితే ఆస్తిని తన మనవడు, వేరే వ్యక్తికి రాసిస్తానని నూకరాజు చెప్పడంతో వారిని చంపేస్తానని బెదిరించాడు. అయితే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడతారని అనుకోలేదని సాధిక్ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
0
9
Previous article
Latest Articles
విజయవాడ మేయర్ సీటుపై జనసేన నేతల ఆందోళన
బెజవాడ నగరంలో జనసేన పార్టీ నాయకుల పరిస్థితి ఇప్పుడు అత్యంత గందరగోళంగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన వస్తేనే గ్లాస్ పార్టీ లీడర్ల ముఖచిత్రాలు పూర్తిగా మారిపోతున్నాయి. తమ భవిష్యత్తు...
- Advertisement -
- Advertisement -


