ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కెరీర్ గురించి చెప్పాలంటే.. పుష్పకి ముందు.. పుష్పకి తర్వాత అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే.. పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం రాకా మూవీ చేస్తున్న అల్లు అర్జున్.. ఆతర్వాత చేసే సినిమాలను కూడా నెక్ట్స్ లెవల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఐకాన్ స్టార్.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. అల్లు అర్జున్ సెట్ చేసిన సరికొత్త రికార్డ్ ఏంటి..?
అల్లు అర్జున్ రాకా మూవీ కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ అయ్యింది. పుష్ప 1, పుష్ప 2లతో.. ఒక్కసారిగా తన మార్కెట్ ని భారీగా పెంచుకున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2కి పారితోషికం కాకుండా, సినిమా బిజినెస్ లో వాటా తీసుకున్నాడట. ఆ బిజినెస్ లెక్కల ప్రకారం.. దాదాపు 130 కోట్లు తీసుకునన్నట్టుగా టాక్ వినిపించింది. ప్రస్తుతం రాక సినిమాకూ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడని తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా బిజినెస్ లో 33 శాతం వాటా తీసుకోబోతున్నాడట ఐకాన్ స్టార్. పుష్ప 2 తర్వాత చేస్తున్న మూవీ కావడంతో రాకా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ అనుకొన్నట్టు జరిగితే.. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్‌కి వాటా రూపంలో దాదాపు 300 కోట్ల వరకూ పారితోషికం అందే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రచారంలో ఉన్నట్టుగా జరిగితే.. సౌత్ ఇండియాలోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా ఐకాన్ స్టార్ సరికొత్త రికార్డ్ సెట్ చేసినట్టు అవుతుందని సమాచారం. ఇరుముడి విషయంలో ఇదే జరిగింది. రవితేజకు పారితోషికంతో పాటుగా నైజాం హక్కుల్ని ఇచ్చేశారు. మహేష్ బాబు కూడా వారణాసి మూవీకి రెమ్యూనరేషన్ కి బదులుగా బిజినెస్ లో వాటానే తీసుకున్నాడని తెలిసింది. అయితే.. ఎంత శాతం ఇచ్చారు అనే లెక్కలు తెలియాల్సివుంది. మరి.. రెమ్యూనరేషన్ పరంగా బన్నీ సెట్ చేసిన రికార్డును ఎవరు క్రాస్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.


