బన్నీ ఫ్యాన్స్ కి.. డబుల్ ట్రీట్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాకా అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో తర్వాత గ్లింప్స్ రిలీజ్ చేస్తారనుకుంటే.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు కానీ.. ఇంత వరుకు రాకా గ్లింప్స్ రిలీజ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బన్నీ నుంచి డబుల్ ట్రీట్ రానుంది అంటూ వార్తలు వస్తుండడం అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది. ఇంతకీ.. బన్నీ నుంచి వచ్చే డబుల్ ట్రీట్ ఏంటి..? వచ్చేది ఎప్పుడు..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఈ నెలలోనే డబుల్ ట్రీట్ దక్కనుందా? అంటే.. అవుననే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా టాక్ అదే. స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న రెండు భారీ ప్రాజెక్టుల నుంచి త్వరలో స్పెషల్ గ్లింప్స్ రాబోతున్నాయనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రానికి ఇప్పటికే రాకా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో బన్నీ పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించడం ఫ్యాన్స్‌లో భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.

తాజా సమాచారం ప్రకారం.. రాకా నుంచి స్పెషల్ గ్లింప్స్ ఆగస్టు చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. దీని పై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. మరో వైపు అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న AA23 పై కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, బన్నీ లుక్ టెస్ట్‌కు సంబంధించిన వీడియో లేదా బీటీఎస్ గ్లింప్స్‌ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉందనే వార్తలు ఇప్పటికే వచ్చాయి.

ఇక ఈ రెండు సినిమాల నుంచి ఆగస్టులోనే ఏదైనా అప్‌డేట్ వస్తే.. బన్నీ అభిమానులకు నిజంగానే డబుల్ ట్రీట్ అవుతుంది. ముఖ్యంగా అట్లీ దర్శకత్వంలోని రాకాలో బన్నీ లుక్ ఎలా ఉండబోతోంది? లోకేష్ సినిమాలో ఆయన అవతార్ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి ఇప్పటికే పీక్స్‌కు చేరింది. అయితే.. ప్రస్తుతం ఇవన్నీ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు, బజ్ మాత్రమే. రెండు గ్లింప్స్ విడుదల తేదీలపై అఫీషియల్ గా క్లారిటీ రావాల్సి ఉంది. మేకర్స్ నుంచి ప్రకటన వచ్చిన తర్వాతే.. దీని పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే నెలలో రెండు భారీ అప్‌డేట్స్ వస్తే.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగే.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్