బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులతో పాటు కీలక పదవులకు ఎంపిక చేసిన వారి జాబితాలను విడుదల చేసింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో ఏపీ నుండి కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ పురంధేశ్వరికి చోటు లభించింది. అలాగే మాజీ సీఎం వసుంధర రాజేతో పాటు రామ్ మాధవ్ కూడా లిస్ట్‌లో ఉన్నారు. బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా మరోసారి బీఎల్ సంతోష్‌కు అవకాశం లభించింది. బీజేపీ జాతీయ మోర్చాలకు జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఏపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం లభించింది.
కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా నియమితులయ్యారు. జాతీయ కోశాధికారిగా పీయూష్ గోయల్‌ను నియమించారు. వీరంతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సారథ్యంలో పనిచేయనున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ నుంచి ఒక్క నేతకి కూడా చోటు దక్కలేదు. గతంలో తెలంగాణ నుంచి ముగ్గురు నాయకులకు పోస్టులు ఉండగా ఈసారి ఒక్కరికి కూడా పదవులు దక్కలేదు.


