ఆ విషయంలో.. నయన్.. మారిందా..?

అందాల తార నయనతార.. తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ.. లేడీ సూపర్ స్టార్ గా కెరీర్లో దూసుకెళుతున్నారు. అయితే.. నయన్.. స్టార్ హీరోల సినిమాలు, మీడియం రేంజ్ సినిమాల్లో నటిస్తుంది కానీ.. ప్రమోషన్స్ కు మాత్రం రాదు. ఏదైనా సినిమా ఒప్పుకునే ముందే.. నయన్ ప్రమోషన్స్ కు రాననే విషయం చెబుతుంది. ఆమె కండీషన్ కి ఓకే అంటేనే.. సినిమాకి సైన్ చేస్తుంది. అయితే.. నయన్ ఇప్పుడు మారిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఏమైంది..?

లేడీ సూపర్‌స్టార్ నయనతార అంటేనే సినిమాల ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే హీరోయిన్‌గా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. సినిమా ఓకే చేసే సమయంలోనే ప్రమోషనల్ ఈవెంట్స్‌కు హాజరు కాలేననే విషయాన్ని స్పష్టంగా చెబుతారని కూడా ఆమె గురించి చాలాకాలంగా ప్రచారం ఉంది. అయితే.. ఇటీవల నయనతార వ్యవహరిస్తున్న తీరు మాత్రం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతోనే నయనతార తన నో ప్రమోషన్స్ పాలసీకి కొంత బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆమె స్వయంగా ప్రమోషనల్ వీడియోలో కనిపించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా యష్ నటించిన టాక్సిక్ విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. సాధారణంగా ప్రమోషనల్ ఈవెంట్స్‌కు దూరంగా ఉండే నయనతార.. టాక్సిక్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరై అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు ప్రమోషన్స్ అంటే పెద్దగా ఆసక్తి ఉండదని, అలాంటి కార్యక్రమాల్లో తాను అంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వనని నయనతార వెల్లడించారు. అయితే.. యష్ ఒక్కసారి ఫోన్ చేసి ఈ ఈవెంట్‌కు రావాలని కోరడంతో తాను వచ్చానని ఆమె చెప్పారు.

దీంతో నయనతార నిజంగానే తన ప్రమోషన్స్ విషయంలో వైఖరి మార్చుకున్నారా? అనే చర్చ మొదలైంది. గతంలో ఎంత పెద్ద సినిమా అయినా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండే నయన్.. ఇప్పుడు మాత్రం తనకు నచ్చిన వ్యక్తులు, తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్న సినిమాల కోసం ముందుకు వస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీన్ని పూర్తిగా నయనతార మారిపోయారు అని చెప్పడం కంటే.. సినిమా, టీమ్‌తో ఉన్న అనుబంధాన్ని బట్టి ఆమె ప్రమోషన్స్ విషయంలో మినహాయింపులు ఇస్తున్నారని చెప్పడం సరైనదని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా.. మన శంకర వరప్రసాద్ గారు కోసం చిరంజీవి, తాజాగా టాక్సిక్ కోసం యష్.. ఇలా నయనతారను ప్రమోషన్స్‌లోకి తీసుకురావడం మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్