విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ చేపట్టిన జార్ఖండ్ బంద్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాంచీలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రోడ్డుపై టైర్లు కాల్చేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా బీజేపీ జార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చింది. సీఎం హేమంత్ సోరేన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
మరోవైపు ఏబీవీపీ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


