ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లు ఖరారు అయ్యాయి. ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవిని మంత్రి వర్గం ఖరారు చేసింది.
బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో BCలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయనుంది.
గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ కోటా.. మున్సిపాలిటీల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
బీసీలకు రాజకీయ సాధికారతే లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లలో టీడీపీదే చారిత్రక పాత్ర అని ఆమె చెప్పారు.


