సంక్రాంతి వస్తుందంటే.. సినిమాల పండగ వస్తున్నట్టే. ఇంకా చెప్పాలంటే.. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే.. యావరేజ్ సినిమా కూడా హిట్టు అవుతుంది. అందుకనే.. ఫిల్మ్ మేకర్స్.. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయాలని పోటీపడుతుంటారు. రానున్న సంక్రాంతికి భారీ, క్రేజీ సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు క్యూకడుతున్నాయి. అయితే.. సంక్రాంతికి వచ్చే సినిమాల లిస్ట్ రోజురోజుకు పెరుగుతుంది. ఇంతకీ.. సంక్రాంతికి ఏ ఏ సినిమాలు రానున్నాయి..?
సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేసిన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే చాలు థియేటర్ల దగ్గర కనకవర్షం కురుస్తుంది. అందుకే.. ఈ సీజన్లో తమ సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు పోటీ పడుతుంటారు. ప్రతి సంవత్సరం నాలుగుకు తక్కువ కాకుండా సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే.. రానున్న సంక్రాంతికి అరడజను సినిమాలకు తక్కువ కాకుండా పోటీలో కనిపిస్తున్నాయి. వరుసగా మూడో సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయడానికి అనిల్ రావిపూడి ఆల్రెడీ ఫిక్సయిపోయాడు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో రూపొందిస్తున్న సినిమా సంక్రాంతికి రావడం పక్కా. ఇంకో వైపు గతంలో సంక్రాంతికే వచ్చి వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, బాబి కొల్లి కాంబినేషన్లో రానున్న కొత్త చిత్రాన్ని కూడా సంక్రాంతికే రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
శర్వానంద్, శ్రీను వైట్లల సినిమా రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. దీనికి జార్జ్ క్రిష్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నారు. ఇక లేటెస్ట్‌గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ మూవీ మహంకాళిని సంక్రాంతి పోటీలోకి తెచ్చారు. ఇక ఊహించని విధంగా సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా సంబరాల యేటిగట్టు కూడా సంక్రాంతి విడుదల చేస్తున్నట్టుగా.. జనవరి 12న రానుందని ప్రకటించారు. అయితే.. చిరు సినిమా పోటీలో ఉంటే.. మరో మెగా హీరో మూవీ తేజ్ సినిమా వస్తుందా అనేది డౌట్.
ఇక కింగ్ నాగార్జున వందో సినిమా కూడా పండుగ రేసులో ఉంటుందని అంటున్నారు. కార్తీక్ తెరకెక్కిస్తున్న కింగ్ 100 మూవీ నుంచి గ్లింప్స్ ఆగష్టు 29న నాగ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. అప్పుడు కింగ్ 100 రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది. రవితేజ, శ్రీవిష్ణు కాంబినేషన్లో మల్టీస్టారర్ రూపొందుతోంది. ఈ సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇలా వచ్చే సంక్రాంతి సినిమాల విషయంలో అప్పుడే హౌస్ ఫుల్ బోర్డు పెట్టేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి.. ఈ సినిమాల్లో ఏ సినిమాలు వస్తాయో.. ఏ సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


