సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరించారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ విడుదల చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి కోవలక్ష్మిను వెనక నుండి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డిలు తోశారని అన్నారు. గంగుల కమలాకర్ మహిళా ఎమ్మెల్యేలను వెనకనుంచి నెట్టుకుంటూ ముందుకు వచ్చారని చెప్పారు. పక్క,పక్కన నిలుచున్న ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్యలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తోసుకుంటూ వచ్చారని.. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్యకు చొరబడాల్సిన అవసరం సుధీర్ రెడ్డికి ఏముందని ప్రశ్నించారు.
మహిళా ఎమ్మెల్యేలను అతుక్కుని నిలబడాల్సిన అవసరం సుదీర్ రెడ్డికి ఏముంది? అని ప్రశ్నించారు.
“మహిళా ఎమ్మెల్యేల మీద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారుణంగా మీద పడ్డారు. ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, సబితమ్మ మీద వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చెయ్యి వేశారు. నవీన్ రెడ్డి నెట్టుకుంటూ పోయినపుడు ఆ మహిళా ఎమ్మెల్యేలు అయ్యో అని అరిచారు. ధర్నా చేయొచ్చు..స్పీకర్‌ని కలవొచ్చు. సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారు…ఆడబిడ్డల పట్ల అసభ్యరంగా ప్రవర్తించారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి కోవలక్ష్మిలను వెనక నుండి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి తోశారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది కీచక పర్వం”.. అని మంత్రి సీతక్క అన్నారు.


