‘ఆళ్ల నాని’కి రాజకీయ నాయకుల నివాళి

ఏలూరు జిల్లా రాజకీయాల్లో విషాదం నెలకొంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హఠాన్మరణంతో రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆళ్ల నాని నివాసానికి చేరుకున్న ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్, ఏలూరు మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు కూడా ఆళ్ల నానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మృతి పట్ల బడేటి చంటి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సిద్ధాంతాలు వేరైనా.. ఆళ్ల నానితో తనకు ఎప్పుడూ వివాదాలు లేవని, ఆత్మీయ సంబంధాలు కొనసాగాయని గుర్తుచేశారు. ఆళ్ల నాని మరణం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలకు, ప్రజలకు తీరని లోటని బడేటి చంటి అన్నారు.

Latest Articles

అసెంబ్లీ సాక్షిగా ఫాంహౌస్‌ భూములపై విచారణకు ఆదేశం

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌పై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కేసీఆర్‌కు వెంటనే నోటీసులు ఇవ్వాలన్న సీఎం రేవంత్‌.. విచారణలో ప్రభుత్వ భూమి అని తేలితే దళితులకు పంచుతామన్నారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్