బొత్స అనూష నిలబడుతుందా?

భీమిలి నియోజకవర్గం.. ఉత్తరాంధ్ర రాజకీయాలకు ఇది ఒక కేరాఫ్ అడ్రస్. అయితే ఇక్కడ వైసీపీ పరిస్థితి మాత్రం వరుస పరాజయాలతో సినిమా కష్టాలను తలపిస్తోంది. పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, ఉన్నట్టుండి పార్టీకి రాజీనామా చేసి సైకిల్ ఎక్కేశారు. దీంతో భీమిలి వైసీపీలో పెద్ద అగాథమే ఏర్పడింది. ఒకపక్క భీమిలిలో ఉన్నది సాదాసీదా నాయకుడు కాదు, ఏకంగా పొలిటికల్ హంక్ గంటా శ్రీనివాసరావు. ఏ గాలికి ఆ చాపేయడంలో, గెలుపును తన జేబులో పెట్టుకుని తిరగడంలో ఆయనకు ఆయనే సాటి. అలాంటి నాయకుడిని ఢీకొట్టాలంటే ఒక రేంజ్ ఉన్న నాయకుడు కావాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గట్టిగానే తర్జనభర్జన పడిపోయారు. చిన్న శ్రీను ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని అక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు అధిష్టానం తీవ్ర కసరత్తు చేసింది.

చిన్న శ్రీను ఎగ్జిట్ తర్వాత భీమిలి ఇన్‌చార్జ్ పదవి కోసం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కొండా రాజీవ్ లాంటి పేర్లు వైసీపీలో గట్టిగానే వినిపించాయి. కానీ, గంటా పేరు వినగానే బహుశా వాళ్లకు కూడా కాస్త చెమటలు పట్టి ఉంటాయని పొలిటికల్ కారిడార్లలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు తెరదించుతూ వైసీపీ అధినేత జగన్ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తిరిగి మళ్లీ తన ఆపద్బాంధవుడు బొత్స సత్యనారాయణ కుటుంబం వైపే మొగ్గుచూపారు. బొత్స కుమార్తె డాక్టర్ బొత్స అనూషకు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా పగ్గాలు అప్పగిస్తూ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ నియామకంతో జగన్ కు పార్టీలో వేరే వాళ్లెవరూ దొరకలేదో లేక బొత్స ఫ్యామిలీ మీద ఉన్న అపారమైన నమ్మకం ఉప్పొంగిందో కానీ.. మొత్తానికి గంటా ముందు ఒక సరికొత్త అస్త్రాన్ని బయటకు తీశారు. భీమిలి వైసీపీకి పట్టిన పొలిటికల్ ఫీవర్‌ను తగ్గించడానికి ఏకంగా ఒక డాక్టరునే ఇన్‌చార్జ్‌గా పంపించారు.

అసలు రాజకీయాలంటే ఏంటో దగ్గరుండి చూడటమే తప్ప, ప్రత్యక్షంగా ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని డాక్టర్ బొత్స అనూష.. రాజకీయ యోధుడు గంటాను ఎలా ఢీకొడుతుందన్నదే ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇన్నాళ్లూ తన తండ్రి బొత్స చాటు బిడ్డగా ఉన్న ఆమెకు ఒక్కసారిగా ఇంత పెద్ద బాధ్యత ఇవ్వడం వెనుక జగన్కో పెద్ద లాజిక్కే ఉందట. 2024 ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఓటమి తర్వాత, చీపురుపల్లిలో వైసీపీ కేడర్ నిరాశలోకి వెళ్లకుండా ఆమె ఎప్పటికప్పుడు వారిలో జోష్ నింపుతూ తండ్రికి బ్యాక్ బోన్‌లా నిలబడ్డారు. ఆ సానుకూల దృక్పథాన్ని గుర్తించిన అధిష్టానం.. ఏకంగా విశాఖ తీరంలో గంటా లాంటి సునామీని ఎదుర్కోవడానికి ఆమెను బలిపశువును.. సారీ.. ప్రధాన అస్త్రంగా ప్రయోగించిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బొత్స సత్యనారాయణకు రాజకీయ వారసురాలిగా అనూష ఇప్పుడు ప్రత్యక్ష పాలిటిక్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు.

భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి కేడర్ బలం అద్భుతంగా ఉన్నా, వాళ్లను స్థిరంగా నడిపించే నాయకుడే కరువయ్యాడు. ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు లాంటి నాయకుడి చేతిలో ఓడిపోగానే, ఆ ఇన్‌చార్జులంతా వేరే నియోజకవర్గాలకు జంప్ అవుతున్నారు. గత ఎన్నికల్లో గంటా ఏకంగా 92వేల భారీ మెజార్టీతో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. నియోజకవర్గంలో ఆయనకు ఉన్నంత బలమైన నెట్‌వర్క్ ఇంకెవరికీ లేదు. దాదాపు మూడున్నర లక్షల ఓటర్లు ఉన్న భీమిలి లాంటి పెద్ద నియోజకవర్గంలో కేవలం ‘బొత్స’ అనే ఇంటి పేరు ఉంటే మ్యాజిక్ జరిగిపోదు. గంటా వేసే పొలిటికల్ మైండ్ గేమ్‌ను తట్టుకోవాలంటే అంతకు మించిన వ్యూహాలు పన్నాలి, సరికొత్త అస్త్రాలు సంధించాలి. రాజకీయాల్లో ఆరితేరిన గంటా స్ట్రాటజీని తట్టుకుని డాక్టర్ అనూష ఎంతవరకు ముందుకెళ్లగలదనేది ఆమె ముందున్న అసలైన, అతిపెద్ద సవాలు.

బొత్స సత్యనారాయణ కూతురు అనే బ్రాండ్‌తో అనూషకు భీమిలి ఇన్‌చార్జ్ పదవి అయితే ఈజీగానే దొరికింది కానీ, గెలుపు అనేది మాత్రం బొత్స ఫ్యామిలీ ఇచ్చే ఉచిత బహుమతి కాదన్న టాక్ వినిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో ఆమె చేసే పోరాటం, ప్రజలతో మమేకం అయ్యే తీరు పైనే రాజకీయ భవిష్యత్ అంతా ఆధారపడి ఉంటుంది. చిన్న శ్రీను పార్టీ మారడంతో ఉత్తరాంధ్ర వైసీపీలో రేగిన అలజడిని ఈ నియామకం కాస్త చల్లార్చింది. భీమిలి నియోజకవర్గం బాధ్యతను తిరిగి బొత్స కుటుంబానికి కట్టబెట్టడం ద్వారా ఉత్తరాంధ్ర వైసీపీకి జగన్ ఒకరకంగా మంచి బూస్టింగ్ ఇచ్చారు. కానీ, ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారి అడుగుపెడుతున్న డాక్టర్ అనూష.. భీమిలి వైసీపీకి సరైన ట్రీట్‌మెంట్ ఇచ్చి ఆరోగ్యంగా కోలుకునేలా చేస్తుందో, లేక గంటా దెబ్బకు మరో సైలెంట్ పేషెంట్‌గా మారుతుందో కాలమే నిర్ణయించాలి.

Latest Articles

తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన

తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్