చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాతావరణ సమతుల్యం దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. శ్రీశైలంలో నీళ్లు లేవు.. తుంగభద్ర ఇంకా ఫుల్ కాలేదని.. రాష్ట్ర రిజర్వాయర్ల పరిస్థితి కూడా అలాగే ఉందని అన్నారు. ప్రస్తుతం తాగునీటి అవసరాలకే నీరు సరిపోతుందని తెలిపారు. వర్షాలు పడితే వెసులుబాటు కలుగుతుందన్న చంద్రబాబు.. క్రమంగా ఎరువుల వాడకం తగ్గించాలని సూచించారు. ప్రకృతి సేద్యం శ్రీరామరక్ష కావాలని చంద్రబాబు స్పష్టం చేశారు.


