విజయవాడలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్‌డెత్ కేసుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సాయికృష్ణ మృతి కేసులో సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సెప్టెంబర్ 30లోగా కేసు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. సీల్డ్ కవర్‌లో కేసు వివరాలు సమర్పించాలని సూచించింది. ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు.. హైకోర్టులో దాఖలైన పిటిషన్లు అన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది. సాయికృష్ణ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 12కి వాయిదా వేసింది. కస్టడీలో సాయికృష్ణ మాయంకావడం చట్టవిరుద్ధమేనని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సాయికృష్ణ కేసులో హైకోర్టులో విచారణపై సుప్రీంకోర్టు స్టే
0
17
Previous article
Latest Articles
ఉపాధ్యాయుల పట్ల వైసీపీకి గౌరవం లేదు- మంత్రి నాదెండ్ల మనోహర్
గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కలిగించేలా, సమాజంలో చీలికలు తెచ్చే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ప్రజాస్వామ్య పద్ధతులకు...
- Advertisement -
- Advertisement -


