హైదరాబాదీ బిర్యానీ టేస్టే వేరబ్బా..!

     ప్రపంచంలో బిర్యానీ రుచి తెలినియోనోళ్లు ఉండరు.. ఇక అందులో చికెన్‌ బిర్యానీ టేస్ట్‌ అదుర్స్‌.. ఈ దబ్‌ బిర్యానీకి పెట్టింది పేరు తెలంగాణ భాగ్యనగరం..ఇక్కడ చేసే స్పెషల్‌ చికెన్‌ బిర్యానీ రెసిపీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక అదే స్థాయిలో భారతీయ వంటకాల్లో ఊరగాయకు ఉన్న స్పెషాలటీ ఏంటో అందికీ తెలియనిది కాదు.. అయితే చాలా పచ్చడ్ల రుచి తెలుసు.. కానీ బిర్యానీతో ఊరగాయ టేస్ట్‌ మాత్రం చాలా మందికి తెలిసి ఉండదు.. ఈ బిర్యానీ ఊరగాయ హైదరాబాద్‌లోనే లభిస్తోంది. ఈ రుచికరమైన పచ్చడి ఎక్కడ లభిస్తోంది.. ఎప్పటి నుంచి లభిస్తోంది.
మామిడికాయ, నిమ్మకాయ వంటి ఊరగాయలు చాలా మందికే తెలుసు.. కానీ స్పెషల్‌గా, డిఫరెంట్‌ టెస్ట్‌తో ఉండే ఊరగాయ గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిందే.. బిర్యానీ రుచితో ఉండే ఊరగాయను హైదరాబాద్‌లోనే లభిస్తోంది. ముర్గీ చౌక్‌లో ఉన్న ఖదీమ్‌ ఆచార్‌ ఘర్‌లో 16 రకాల ఊరగాయలు లభిస్తాయి. అందులో బిర్యానీ రుచితో తయారు చేసిన ఊరగాయ కూడా ఉంది. ఈ పచ్చడికి మంచి పేరుంది.. 1954లో కిరాణా దుకాణంగా ప్రారంభన ఈ షాపులో.. అప్పట్లో అదనపు ఉత్పత్తులుగా మాత్రమే ఊరగాయాలు అమ్మెవారు. కానీ రాను రాను ఆ పికిల్స్‌ మంచి ప్రజాదరణ పొందాయి. అందరూ వాటి టేస్ట్‌కు అలవాటు పడి మెయిన్‌ బిజినెస్‌గా మారిపోయింది.
రుచికరమైన, మసాలా దినుసులతో కూడిన హైదరాబాద్‌ బిర్యానీ స్పూర్తితో ఈ ఊరగాయను తయారు చేశారు. బిర్యానీ రుచిని గుర్తుచేసేలా పికల్ తయారు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ బిర్యానీ అచార్‌కు ప్రపంచదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఇతర దేశాల్లో ఉంటున్న హైదరాబాద్‌ వాసులు ఈ ఊరగాయలకు ఫ్యాన్స్‌ ఉన్నారు. అన్నంలో కలుపుకుని తింటే ఇంటి రుచిని ఇస్తుందని.. ఇళ్లు గుర్తుకు వస్తుందని చెబుతుంటారు. ఈ ఊరగాయకు బిర్యానీ రుచి తెవడానికి చాలా కష్టపడ్డామని చెప్పారు. సరైన రుచి, ఫ్లేవర్‌ కోసం రెండు నెలల పాటు ప్రయోగాలు చేశారు. అనేక బ్యాచ్‌లు తయారు చేసినట్లు యజమానులుద చెప్పారు. ఈ బిర్యానీ తయారు చేయడానికి 20కి పైగా పదార్థాలను ఉపయోగిస్తారు. లవంగాలు, బిరిస్తా, వేయించిన ఉల్లిపాయ, యాలకులు, జీడిపప్పు, దాల్చిన చెక్క వంటి సంప్రదాయ మసాల దినుసులు ఇందులో కలుపుతారు.
నిజమైన బిర్యానీకి భిన్నంగా ఈ ఊరగాయ పూర్తిగా శాకాహారంతో తయారవుతుంది. ఇది బిర్యానీ ఆత్మను కలిగి ఉంటుంది. రోజువారీ భోజనానికి సరిపోయే విధంగా  బిర్యానీ రుచిని కొత్త రూపంలో అందిస్తున్నారు. శాకాహార ఊరగాయలను వారానికి రెండుసార్లు తాజాగా తయారు చేస్తారు. మాంసాహార ఊరగాయలను మాత్రం ప్రతి రెండు రోజులకు ఒకసారి తాజాగా తయారు చేస్తారు. సెలవుల సమయంలో ఈ దుకాణంలో రోజుకు పది కిలోల వరకు మాంసాహార ఊరగాయలు విక్రయస్తుంటారు. ఈ దుకాణం ఇప్పటికీ కుటుంబ ఆధారిత వ్యాపారంగానే కొనసాగిస్తున్నారు. దుకాణం ఉన్న ప్రదేశం అక్కడే ఉన్నప్పటికీ.. కాలానుగుణంగా వ్యాపార విధానాలను మార్పులు చేసుకున్నారు.. ఇంట్లో తయారు చేసే ఊరగాయాలను ఇప్పుడు వ్యాక్యూమ్‌-సీల్‌ ప్యాకెట్లలో పంపిణీ చేస్తున్నారు. ఆర్డర్ల కోసం సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం పప్పులు, బియ్యంతో తయారు చేసిన వివిధ రకాల అప్పడాలను కూడా కస్టమర్లకు విక్రయిస్తున్నారు. ఏది ఏమైనా హైదరాబాద్‌ బిర్యానీకి ఎంతో ఫేమ్‌ ఉందో… బిర్యానీ పచ్చడికీ అదే లెవల్‌లో ఫేమ్‌ లభిస్తోంది. ఆ ఆహా ఏమి రుచి.. మైమరిచే రుచి అంటూ బిర్యానీ పచ్చడిని ప్రపంచ వ్యాప్తంగా లాగించేస్తున్నారు.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్