దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ హై-ప్రొఫైల్ ‘సౌరభ్ రాజ్‌పుత్’ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి నేరం యొక్క తీవ్రత, క్రూరత్వాన్ని పరిగణలోకి తీసుకున్న జిల్లా జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా.. ఇద్దరు దోషులకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే దురాలోచనతో భర్తను అత్యంత క్రూరంగా హతమార్చిన భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.
————-
జైలు నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ ఇద్దరు దోషులు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. శిక్షాకాలంపై విచారణ సందర్భంగా, తీర్పు వెలువడే ముందు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని కోర్టు వారిని ప్రశ్నించగా.. తమకు చెప్పడానికి ఏమీ లేదని ఇద్దరూ బదులిచ్చారు. మధ్యాహ్న భోజనం తర్వాత వారిని మరోసారి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం తుది తీర్పును ప్రకటించింది.
————
జైలు అధికారుల సమాచారం ప్రకారం.. కోర్టు తీర్పు చదువుతున్న సమయంలో ముస్కాన్ రస్తోగి చేతులు జోడించి కన్నీటిపర్యంతమైంది. మరో దోషి సాహిల్ శుక్లా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ఈ కేసులో నేరం ఎంతటి ఘోరమైనదో వివరిస్తూ, ప్రాసిక్యూషన్ ఇద్దరికీ గరిష్టంగా మరణశిక్ష విధించాలని గట్టిగా వాదించింది. మరోవైపు, డిఫెన్స్ తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. ముస్కాన్ చిన్న పిల్లల భవిష్యత్తు, పెంపకాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమెపై కొంత కనికరం చూపాలని కోర్టును విజ్ఞప్తి చేశారు.
———–
126 విచారణలు, 22 మంది సాక్షుల వాంగ్మూలం తర్వాత, డిస్ట్రిక్ట్ జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా రస్తోగి, శుక్లా కలిసి సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నారని తేల్చారు. మృతుడు రాజ్‌పుత్ భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు మరణశిక్ష విధించారు. అయినప్పటికీ, ఫోరెన్సిక్ శాస్త్రీయ ఆధారాలను, సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు.. ఇలాంటి కిరాతక నేరాలు సభ్య సమాజంలో తీవ్ర భయోత్పాతాన్ని, భయాన్ని సృష్టిస్తాయని వ్యాఖ్యానించింది.
———
పోలీసుల కథనం ప్రకారం యూపీ, మీరట్‌కు చెందిన మాజీ నేవీ అధికారి అయిన సౌరభ్ రాజ్‌పుత్.. 2025 మార్చి 3న హత్యకు గురయ్యాడు. అతడి భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిలు శుక్లా కలిసి ఆహారంలో మత్తుమందు కలిపిం అతడిని హతమార్చారు. అనంతరం మృతదేహం కుళ్ళి దుర్వాసన బయటకు రాకుండా ఉండేందుకు, వారు ఆ శరీర భాగాలను ఒక పెద్ద నీలం రంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో ఉంచి, దానిని ఇసుక, నీరు మరియు సిమెంట్ మిశ్రమంతో నింపి సీల్ చేశారని దర్యాప్తులో తేలింది. ఆ జంట మరుసటి రోజే హిమాచల్ ప్రదేశ్‌కు పారిపోయింది. రాజ్‌పుత్ బతికే ఉన్నాడని, వ్యాపార పని మీద ప్రయాణం చేస్తున్నాడని నమ్మించేలా రస్తోగి అతని మొబైల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశాలు పంపింది. ఘటన జరిగిన కొన్ని రోజులకు పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా ఈ హత్య వెలుగులోకి వచ్చింది.
—————-
ఈ కేసును అరుదైన వాటిలో అత్యంత అరుదైనదిగా పరిగణిస్తూ ఇద్దరికీ మరణశిక్ష సరైందని కోర్టు తీర్పునిచ్చింది. శిక్ష ఖరారైన సమయంలో దోషులు తమ వాదనలను న్యాయస్థానం ముందు ఉంచినట్లు సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ తెలిపారు. ఈ సంచలనాత్మక తీర్పు స్థానికంగా మరియు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
మీరట్‌లో సంచలనం సృష్టించిన సౌరభ్ రాజ్‌పుత్ హత్య
Latest Articles
- Advertisement -


