ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం. ‘ధార్ గ్యాంగ్’ కదలికలను పసికట్టారు పోలీసులు. దీంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాకు చెందిన ఒక ముఠా ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన రెండు జిల్లా ఎస్పీలు గ్యాంగ్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించే పనిలో పడ్డారు. ఒకపక్క ఆయా జిల్లాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ గ్యాంగ్ నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దోపిడీలకు దొంగతనాలకు పాల్పడుతూ అడ్డు వచ్చిన వారిని హతమార్చటమే వీరి పని అని తెలుస్తుంది.


