భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్రకు సింహద్వారమని విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉత్తరద్వారంలా భోగాపురం తెరుచుకుందని అభిప్రాయపడ్డారు. ఎర్రబస్సులు కాదు.. ఎయిర్‌బస్సులు తిరిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర ఎదిగిందని కేంద్రమంత్రి అభివర్ణించారు. ఉత్తరాంధ్రకు రైల్వేజోన్‌తో పాటు.. మూలపేట పోర్టు కూడా తీసుకొచ్చామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోంస అహర్నిశలు కృషిచేస్తున్నామన్నారు.
మన్యం దొర అల్లూరి సీతారామరాజు పేరు ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి మోదీ అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అందుకే భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారారామరాజు విమానాశ్రయం పేరు పెట్టామన్నారు. ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా మార్చేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. మోదీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. వికసిత్ భారత్ కలను నిజం చేసేందుకు ఉత్తరాంధ్ర మోదీకి తోడుంటుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విత్తనం వేసిందే చంద్రబాబునాయుడని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.


