ఏపీలో భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని.. ఉత్తారంధ్ర దశాదిశను భోగాపురం ఎయిర్‌పోర్టు మారుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కొబ్బరికాయ కొట్టింది మేమే.. ఇవాళ గుమ్మడికాయ కట్టింది మేమే.. అని చెప్పారు. రెండేళ్ల క్రితం విధ్వంసకర రాష్ట్రాన్ని చూశామన్న చంద్రబాబు..ఉత్తరాంధ్రను అవహేళన చేసినవారు.. అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చిందని అన్నారు. ఎర్రబస్సులు కూడా తిరగని ప్రాంతం అంటూ వెక్కిరించారని.. ఇప్పుడు ఎయిర్ బస్సు వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు చాలా మంది ప్రయత్నించారని.. వాటిని అధిగమించి ఎయిర్‌పోర్టు నిర్మించుకోవడం మనందరికీ గర్వకారణమని చెప్పారు.
విమానాశ్రయం రావడంతో ఉత్తరాంధ్రకు కంపెనీలు క్యూ కడుతున్నాయని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో ఉత్తరాంధ్రకు రెక్కలొచ్చాయని తెలిపారు. ఎర్రబస్సు రాదన్నారు.. ఎయిర్‌బస్సు తీసుకొచ్చి చూపించామని చంద్రబాబు తెలిపారు. అవహేళన చేసినవాళ్లు అడ్రస్ లేకుండా పోయారని చంద్రబాబు విమర్శించారు. అల్లూరి పేరు విమానాశ్రయానికి పెట్టడం రాష్ట్రానికి గర్వకారణమిన తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టిన వ్యక్తి ప్రధాని మోదీ అని చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను మోదీ కాపాడారని గుర్తుచేశారు. రాజధానికి, పోలవరానికి నిధులిచ్చి సాయం చేసింది ప్రధాని మోదీనే అని అన్నారు. 2028లో అమరావతి మొదటిదశను ప్రారంభిస్తామని తెలిపారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ కొబ్బరికాయ.. గుమ్మడికాయ కొట్టింది తామేనని బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా నిలిపే శక్తి కూటమి ప్రభుత్వానికి ఉందని చంద్రబాబు తెలిపారు.


