మే నెల నుంచి ‘అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అర్హత కలిగిన రైతులందరికీ 20 వేల రూపాయల నగదు అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధివిధానాలను ఖరారు చేస్తున్నామని తెలిపారు. రైతులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని..కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రలో భారీ అవినీతి జరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించడానికి ఒక ఇండిపెండెంట్ కమిటీతో విచారణ వేసి 45 రోజుల్లో నివేదిక సమర్పిస్తామని తెలిపారు.