ప్రముఖ దర్శకుడు భారతీరాజా(84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1941 జులై 17న భారతీరాజా జన్మించారు. 1977లో డైరెక్టర్‌గా 16 వయత్తినిలే తొలి సినిమా. కొత్త జీవితాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. సీతాకోకచిలుకకు చిత్రానికి గాను భారతీరాజాకు నంది అవార్డు లభించింది.
కిజక్కే పోగుమ్ రైలు, సిగప్పు రోజక్కల్ లాంటి..ఎన్నో హిట్ సినిమాలు చేశారు భారతీ రాజా. దాదాపు 20 సినిమాల్లో నటుడిగా వివిధ పాత్రలు పోషించారు. మట్టి వాసనను వెండితెరకు తీసుకొచ్చిన భారతీరాజా..గ్రామీణ కథల మహర్షిగా తమిళంలో మంచి గుర్తింపు పొందారు. సెల్యులాయిడ్‌పై పల్లె సోయగాలు చూపించిన ప్రతిభ ఆయనది. భారతీరాజాకు 6 జాతీయ చలనచిత్ర అవార్డులు వచ్చాయి. 2004లో భారతీరాజాకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది కేంద్ర ప్రభుత్వం.
సినిమాల్లోకి రాకముందు హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు భారతీరాజా. ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు జరగనున్నాయి. భారతీరాజా మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


