తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యామండలి గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో 6 కొత్త కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రజెంట్ ట్రెండ్‌కు తగినట్టు కొత్త కోర్సుల రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని 5 ప్రధాన యూనివర్సిటీల్లోనూ..
కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బీఏ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ గవర్నెన్స్, బీఏ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, బీఎస్సీ డిజిటల్ ఫారెన్సిక్ అండ్ సైన్స్ టెక్నాలజీ కొత్త కోర్సులు విద్యార్థులకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 16 వరకు కొత్త కోర్సులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించింది. డిగ్రీ మొదటి, రెండవ విడతలో సీట్లు పొందిన వారు.. కొత్త కోర్సులకు మార్చుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది.
డిగ్రీలో 6 కొత్త కోర్సులు
Latest Articles
- Advertisement -


