హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త రివాల్వర్‌తో కాల్చి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతురాలు నిషా రాణిగా గుర్తించారు. ఆరు నెలల కిందట నిందితుడు అరుణ్ దగ్గర అక్రమంగా రివాల్వర్ ఉందంటూ అంబర్ పేట్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో కొంతకాలం జైలు శిక్ష అనుభవించిన అనంతరం ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం.
అరుణ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, ఆమె సొంత చెల్లెలైన నిషా రాణిని ఐదేళ్ల క్రితం యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న అరుణ్… ఇదే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
హత్య అనంతరం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన మల్కాజిగిరి పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


