పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో తృణమూల్ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ పార్టీ అన్ని పదవులకు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామ లేఖను పంపించారు. దీంతో మరో రాజ్యసభ ఎంపీ తృణముల్ నుంచి తప్పుకున్నట్టైంది.
రాజ్యసభ ఎంపీగా తాను రాజీనామా చేస్తున్నానని.. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణకు రాసిన లేఖలో ఆమె కోరారు. రాజీనామా చేసిన కాసేపటికే ఆమె అసోం ముఖ్యమంత్రి హిమంత శర్మను ఢిల్లీలోని ఆయన ఇంట్లో కలిసిన ఫోటోలు బయటకు వచ్చాయి. 53 ఏళ్ల సుస్మిత.. కాంగ్రెస్ పార్టీ నుంచి 2021లో తృణముల్ కాంగ్రెస్‌లో చేరారు. ప్రజలకు సేవ చేసేందుకు కొత్త ప్రయాణం మొదలుపెట్టినట్టు అప్పట్లో చెప్పారు.


