సోమవారం తెల్లవారుజామున ఫిలిప్పీన్స్ దక్షిణ తీరానికి సమీపంలోని సముద్ర ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంపం కారణంగా అనేక భవనాలు దెబ్బతిన్నాయి. దక్షిణ ప్రాంతంలోని ఒక ప్రధాన నగరానికి వెళ్లే కీలక వంతెన కూడా దెబ్బతింది. భూకంపం ప్రభావంతో సుమారు 1 మీటర్ (3 అడుగులు) ఎత్తైన సునామీ అలలు సమీప తీర ప్రాంతాలను తాకాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో కనీసం నలుగురు మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినంన్డ్ మార్కోస్ జూనియర్ (Ferdinand Marcos Jr.) సునామీ ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇదే సమయంలో ఇండోనేషియ, మలేషియా అధికారులు కూడా తమ తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం.. నలుగురు మృతి.. సునామీ హెచ్చరికలు
0
53
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


