ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అమరావతిలో రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నిర్మాణానికి రంగం సిద్ధం కానుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సచివాలయానికి సమీపంలో సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నిర్మాణం జరగనుంది. ఇందులో భాంగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం రూ.1,299.08 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలకు రూ.1,234.91 కోట్లు వెచ్చించనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 1,504 క్వార్టర్స్ నిర్మితం కానున్నాయి. ఈ ఆస్తి 2,226 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 2,194 చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణం ఉండడంతో, ఇది ఆ ప్రాంతంలోని ప్రీమియం నివాస ఆస్తుల్లో ఒకటిగా నిలుస్తుంది.


