సుదీర్ఘకాలం ప్రజాసేవ రంగంలో పనిచేసి రాజకీయలతో పూర్తిగా ప్రజలకు సేవలు అందించవచ్చనే కారణంతో జనసేన పార్టీలో చేరానని మాజీ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి తాను జనసేన పార్టీలో చేరినట్లు చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా లాంటి సంక్లిష్ట కాలంలో హెల్త్ డైరెక్టర్‌గా పూర్తిగా ప్రజలలో ఉంటూ వారి సాధక బాధకాలను చూసిన తాను పేదలకు ఉచిత వైద్యం, విద్య, యువతకు ఉద్యోగ అవకాశాల అవసరాలను గుర్తించి రాజకీయంలో ఉంటేనే అది సాధ్యమని తెలుసుకొని పార్టీలోకి వచ్చినట్టు తెలిపారు. ప్రజల కోసం అవసరమైతే ఏ పార్టీతోనైనా సిద్ధాంతపరంగా విభేదిస్తూనే ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు.
పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరాను-గడల శ్రీనివాసరావు
0
10
Previous article
Next article
Latest Articles
వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే
ఒకరు 90 ఏళ్లు దాటిన వయసులో, మరొకరు 70 ఏళ్లు దాటిన వయసులో సినిమాలు తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేశారు. తెలుగు సినిమా సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు...
- Advertisement -
- Advertisement -


