ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ మనిషి కార్పొరేటర్‌కు ఎక్కువ..ఎమ్మెల్యేకు తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ఆయన జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారనిసెటైర్లు చేశారు. కాగా, జగన్‌కు ప్రతిపక్ష హోదాపై ఇటీవల పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, ఆయనకు వచ్చిన సీట్లకు జర్మనీలోనే ప్రతిపక్ష హోదా వస్తుందని పవన్ కామెంట్స్ చేశారు.