సందీప్ కిషన్.. టాలెంటెడ్ యాక్టర్. ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాడు కానీ.. రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. సందీప్ బాధ అంతా ఇదే. ఇటీవల మజాకా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. ఇప్పుడ సందీప్ ఆశలన్నీ ఒక సినిమా పైనే పెట్టుకున్నాడు. ఇంతకీ.. ఏంటా సినిమా..? ఈసారైనా సందీప్ కి సక్సెస్ వచ్చేనా..?
సందీప్ కిషన్.. ప్రస్ధానం, స్నేహగీతం, రోటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి.. తదితర చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు కానీ.. సరైన గుర్తింపు రాలేదు. అందుకనే.. కామెడీ, మాస్, హర్రర్, పాన్ ఇండియా సినిమా.. ఇలా ఒకటేమిటి అన్ని ప్రయత్నాలు చేశాడు కానీ.. కాలం కలసి రాకపోవడమో.. సరైన కథలు ఎంచుకోకపోవడం వలనో సక్సెస్ మాత్రం రావడం లేదు. నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో నటించిన మజాకా మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఈ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది.. సందీప్ కెరీర్ లో మరో ప్లాప్ మూవీగా నిలిచింది.
తమిళ్ స్టార్ విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్ లో సందీప్ కిషన్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఓ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సందీప్ కిషన్ ఇప్పుడు ఫ్యామిలీ మేన్ 3, సుబ్బు అనే రెండు వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. తెలుగులో హీరోగా నటించే సినిమా కోసం కథాచర్చలు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు సందీప్ ఆశలన్నీ సంజయ్ డైరెక్షన్ లో చేసే సినిమా పైనే ఉన్నాయి. మరి.. ఈ మూవీ అయినా సందీప్ కి ఆశించిన సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.