దేవర 2.. లేనట్టేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో రూపొందిన సినిమా దేవర. ఈ మూవీకి సీక్వెల్ ఉందని ఎప్పుడో ప్రకటించారు. ఆతర్వాత దేవర 2 క్యాన్సిల్ అంటూ ప్రచారం జరిగితే.. స్వయంగా ఎన్టీఆరే.. దేవర 2 ఉంటుందని అభిమానుల సమక్షంలో అనౌన్స్ చేశారు. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. ఈరోజు మళ్లీ దేవర 2 వార్తల్లో నిలిచింది. ఇంతకీ.. దేవర 2 ఉందా..? లేదా..? అసలు ఏం జరుగుతోంది..?

దేవర సినిమా రిలీజ్ తర్వాత నుంచి కొరటాల శివ.. దేవర 2 పై వర్క్ చేస్తూనే ఉన్నారు. దేవర సినిమాకు మించి ఉండేలా దేవర 2 కథలో మార్పులు చేర్పులు చేశారు. ఎన్టీఆర్ ఎప్పుడు డేట్స్ ఇస్తే.. అప్పుడు ఈ క్రేజీ సీక్వెల్ పట్టాలెక్కించాలని కొరటాల శివ రెడీగా ఉన్నారు. అయితే.. ఎన్టీఆర్.. ప్రస్తుతం డ్రాగన్ మూవీ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమాని ఈ ఇయర్ జూన్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. నెక్ట్స్ ఇయర్ జూన్ 11కి పోస్ట్ పోన్ అయ్యింది. అంటే.. అప్పటి వరుకు ఎన్టీఆర్ వేరే సినిమాని చేయలేరు. డ్రాగన్ పైనే మొత్తం ఫోకస్ పెట్టారు.

డ్రాగన్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ భారీ మైథలాజికల్ మూవీ చేయాలి. అందుచేత దేవర 2 లేనట్టే అంటూ ప్రచారం ఊపందుకుంది. మరో వైపు కొరటాల కథ పట్టుకుని కొంత మంది స్టార్ హీరోల చుట్టూ తిరుగుతున్నట్టుగా వార్తలు రావడంతో దేవర 2 లేనట్టే అని ఎన్టీఆర్ అభిమానులు, సినీ అభిమానులు ఫిక్స్ అయ్యారు. బాలయ్యతో కొరటాల శివ సినిమా చేస్తుండడంతో ఇక దేవర 2 లేదని వార్తలు వచ్చాయి. అయితే.. దేవర మేకర్స్ నుంచి మాత్రం దేవర 2 గురించి ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో దేవర 2 ఉందా..? లేదా..? అనేది సస్పెన్స్ గా మారింది.

ఇదిలా ఉంటే.. సోమవారం కొరటాల శివ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేవర టీమ్ పేరుతో కొరటాల శివకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బర్త్ డే విషేష్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. దీంతో మరోసారి దేవర 2 వార్తల్లో నిలిచింది. దేవర 2 లేకపోతే.. ఎన్టీఆర్ ఆర్ట్స్ కొరటాల శివకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పచ్చు కానీ.. దేవర టీమ్ తరుపున అని ఎందుకు చెబుతారు. అలా చెప్పారంటే.. దేవర 2 ఉన్నట్టే అంటూ సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ఏది ఏమైనా.. దేవర 2 సస్పెన్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. మరి.. దేవర 2 ఉందో లేదో.. ఉంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Latest Articles

పదవుల కోసం కాదు దేశభక్తితో ఢిల్లీ వచ్చాం – నాదెండ్ల మనోహర్‌

దేశ భక్తి, దేశ సమగ్రత రాబోయే తరాలకు చాలా అవసరమని... దానిని జనసేన పార్టీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లేలా పనిచేస్తుందని... ఇందులో భాగంగానే దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ సమైక్యత కోసం సేన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్