రాహుల్ రవీంద్రన్.. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆతర్వాత దర్శకుడిగా.. కొత్త ప్రయాణాన్ని ఆరంభించి సక్సెస్ అయ్యాడు.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఇటీవల గర్ల్ ఫ్రెండ్ మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ హీరో టర్నడ్ డైరెక్టర్ కి.. ఓ డిఫరెంట్ థాట్ వచ్చిందట. ఓ లెజండరీ డైరెక్టర్ ఇన్ స్పిరేషన్తో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడట. ఇంతకీ.. ఆ లెజండరీ డైరెక్టర్ ఎవరు..? అసలు కథ ఏంటి..?
అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి రాహుల్ రవీంద్రన్.. ఆతర్వాత పెళ్ళి పుస్తకం, హౌరా బ్రిడ్జి, హైదరాబాద్ లవ్ స్టోరీ.. ఇలా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు కానీ.. సరైన బ్రేక్ రాలేదు. ఆతర్వాత శ్రీమంతడు, యుటర్న్, శ్యామ్ సింగ రాయ్ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి మెప్పించాడు. అయితే.. హీరో కాస్తా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడం కూడా రాహుల్ రవీంద్రన్ కు సంతృప్తిని ఇవ్వలేదు. అందుకనే.. మెగా ఫోన్ పట్టుకున్నాడు. సుశాంత్ హీరోగా చిలసౌ అనే సినిమా తీసి విమర్శలకు ప్రశంలు అందుకున్నాడు. రెండో సినిమాకే ఏకంగా కింగ్ నాగార్జునను డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు. మన్మథుడు 2 తీసాడు కానీ.. ఆ సినిమా విజయాన్ని అందివ్వలేదు.
ఇటీవల గాళ్ ఫ్రెండ్ మూవీ తో మళ్లీ తన మార్క్ చూపించారు. ఆ సినిమా ఆయనకు చాలా చాలా సంతృప్తి ఇచ్చింది. దర్శకుడిగా ఇంకొన్ని కథలు సిద్ధం చేసుకొనే పనిలో ఉన్నారాయన. ఇదిలా ఉంటే.. రాహుల్ రవీంద్రన్ కు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు అంతు లేని స్ఫూర్తి ఇచ్చారట. విషయం ఏంటంటే.. సింగీతం శ్రీనివాసరావు.. సింగ్ – గీతం సినిమా తీయాలి అనేది నలభై ఏళ్ల కల అట. అప్పట్లో కమల్ హాసన్ తో తీయాలి అనుకున్నారట. కానీ.. కుదర్లేదు. ఆ తరవాత చాలా ప్రయత్నాలు జరిగాయి. మధ్యలో కొంతమంది నిర్మాతల్ని కలిసి ఈ కథ వినిపించారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. చివరికి నాగ్ అశ్విన్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.
అయితే.. ఒక కథ పట్టుకొని, ఓ లెంజెడరీ దర్శకుడు నలభై ఏళ్ల పాటు నిరీక్షించారంటే.. ఇంతకంటే గొప్ప కథేముంటుంది అని రాహుల్ కి అనిపించిందట. దాంతో ఈ ప్రయాణాన్ని ఆయన కథగా మలచాలని భావిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన రైట్స్ సింగీతం గారి దగ్గర తీసుకోవాలో, నాగ అశ్విన్ గారి దగ్గర తీసుకోవాలో తెలీదు. కానీ.. తప్పకుండా ఈ ప్రయాణాన్ని ఓ సినిమాగా తీస్తా అన్నారు రాహుల్ రవీంద్రన్. మరి.. ఈ కథ ఎప్పుడు సినిమాగా వస్తుందో.. ఎవరు నటిస్తారో..? తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.


